కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ శివార్లలోని ఆదివారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నిజామాబాద్ జిల్లా వేల్పుర్ మండలం సీతరంపూర్ గ్రామము నుంచి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు అలాగే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ సమీపంలో మహిళలు మల్లన్న పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు తీర్చారు దీంతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కిటకిటలాడింది నిజామాబాద్ జిల్లా వాసులు మాట్లాడుతూ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన మైలారం శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఎలాంటి మొక్కలు మొక్కిన మల్లన్న స్వామి తీర్చారని తెలిపారు శ్రీ మైలారం మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వారాల పరుశరాములు ను అభినందించారు దేవాలయంను మరింత అభివృద్ధి చెందేలా చూడాలని భక్తులు కోరారు