కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్వో రాజేశ్వరి స్థానిక సర్పంచ్ గంప మల్లేశ్వరి కలిసి గ్రామంలో మొక్కలు నాటారు ఎమ్మార్వో రాజేశ్వరి మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ మండల నాయకులు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,ఆర్ ఐ రజిని కుమార్, వీఆర్వో, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు