contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

THE REPORTER TV

రామగుండం సీపీని కలిసిన ప్రభాస్‌

 

పెద్దపల్లి : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సలార్‌ చిత్రం రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామగుండంకు వచ్చిన ఆయన సీపీని కలిశారు. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సలార్‌ చిత్రంలో భాగంగా బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‌ వేసింది. ఇక్కడ పది రోజుల పాటు ఓపెన్‌ కాస్ట్‌ గనిలో షూటింగ్‌ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :