contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాముని పై అనుచిత వ్యాఖ్యలా? సోయుండి మాట్లాడినవా ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి..!

  •  బిజెపి జిల్లా  అధికార ప్రతినిధి  బొంతల కళ్యాణ్ చంద్ర 
  • ఈస్ట్ జోన్ అధ్యక్షుడు ఆదుర్తి శ్రీనివాస్

హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణ  విషయంలో అయోధ్య రాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి  ప్రజల మనోభావాలతో ఆటలాడుతున్న  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  హిందూ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఈస్ట్ జోన్ అధ్యక్షులు  ఆదుర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు .అయోధ్య రాముడు విషయంలో  ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు  చేసిన  అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ  శుక్రవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా లో  ఈస్ట్ జోన్ అధ్యక్షులు ఆదుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు దిష్టిబొమ్మ  దహన  కార్యక్రమం నిర్వహించారు  ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి  బొంతల కళ్యాణ్ చంద్ర ,ఈస్ట్ జోన్ అధ్యక్షుడు ఆదుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు  భారతదేశంలోని ప్రతి ఒక్క హిందూ ప్రజానీకం భాగస్వామ్యం కావాలని శ్రీ రామ జన్మభూమి  క్షేత్ర ట్రస్ట్ పిలుపునిచ్చింది అని తెలిపారు.  అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్  ఏర్పాటు అయిందని ,ట్రస్టు లో అనేక హిందూ ధార్మిక సంస్థలు, కొంతమంది మఠాధిపతులు, సమాజంలోని అన్ని వర్గాల లో నిష్ణాతులైన వ్యక్తులను   ట్రస్టులోభాగస్వామ్యం చేసిన  విషయం ఎమ్మెల్యే విద్యాసాగరరావు తెలుసుకోవాలన్నారు.  రామజన్మభూమి విషయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీజేపీపై పనికిమాలిన చౌకబారు ఆరోపణలు  చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ రాముడి కోసం బిజెపి బిక్షం ఎత్తుకుoటుందని హేళనగా  మాట్లాడినవిషయం హిందూ ప్రజలంతా గమనించాలని కోరారు .అయోధ్య రాముడు కి మనకు  ఏమి సంబంధమని  అయోధ్య రాముని కి డబ్బులు ఇవ్వొద్దని ప్రజలను రెచ్చగొట్టడం ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శనమన్నారు. రాముని జన్మభూమి అయోధ్య అని ప్రపంచ దేశాలకు  తెలిసిన మన భారతదేశంలోనే ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావుకు అయోధ్య విశిష్టత  రాముడి ప్రాముఖ్యత తెలియక పోవడం సిగ్గు చేటన్నారు. రాముడు హిందువులకు ఆరాధ్య దేవుడని, రాముడు జన్మస్థలం లో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం 500 సంవత్సరాల పోరాటం, నాలుగు లక్షల మంది ప్రాణత్యాగం చేసి నేడు అన్ని సమస్యలు తొలగిపోయి రామమందిర నిర్మాణం చేపడితే  హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా  రాముడుపై ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. లోగడ ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులు బొందు గాల్లో అని చులకన చేశారని   ,నేడు అదే పార్టీ ఎమ్మెల్యే హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందూ ప్రజలందరూ గ్రహించాలని కోరారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బిజెపి కొత్త నాటకానికి తెర తీసింది అని తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.  బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనలేక దైవ సంబంధమైన విషయంతో ముడిపెట్టి ఎమ్మెల్యే చౌకబారు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వందల ఏళ్ల పోరాటం తర్వాత హిందువులకు  ఆమోదయోగ్యమైన తీర్పుతో ఇన్నాళ్లకు రామమందిర నిర్మాణం  మొదలు పెడితే ఇందులో కూడా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు.  ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన తప్పును తెలుసుకొని హిందూ ప్రజలందరికీ, రామ భక్తులకు క్షమాపణ చెప్పాలని లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే తిరగకుండా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ ప్రతినిధులు మాసం గణేష్, లక్కాకుల మునిందర్, తోట అనిల్, పో రెడ్డి శ్రీధర్, ఉమామహేశ్వర్, మధు  లతోపాటు  ఈస్ట్ జోన్ పరిధిలోని వివిధ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :