కరీంనగర్ జిల్లా గన్నేరువరం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గన్నేరువరం గ్రామ శివారులో గన్నేరువరం గ్రామానికి చెందినటువంటి రాపోలు రాయమల్లు మరియు మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి గొడుగు చంద్రయ్య వర్షంలో ఇద్దరు ద్విచక్రవాహనాలపై ఎదురెదురుగా వస్తు ఒకర్నొకరు ఢీకొన్నారు దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి వెంటనే సమాచారం తెలుసుకున్న గన్నేరువరం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా వారిద్దరూ వర్షంలో పడిపోయి ఉన్నారు వెంటనే వారిద్దరిని పోలీసులు తమ పోలీసు వాహనంలో గన్నేరువరం స్థానిక ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం తరలించి తదనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం గుండ్లపల్లి ఆసుపత్రికి పోలీసు వాహనంలో తరలించడం జరిగింది