కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాని పల్లె గ్రామ సర్పంచ్ కు గ్రామస్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది చాకలివాని పల్లె గ్రామ పరిధిలోని కూనవాని పల్లె చెందిన ముదిరాజులు సోమవారం రాత్రి పోచమ్మ బోనాలు చేసి చాకలివాని పల్లె గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం వద్దకు మొక్కలు చెల్లించడానికి వెళ్లారు, ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నక్క మల్లయ్య మహిళలపై దుర్భాషలాడుతూ వారిని మొక్కులు చెల్లించకుండా గ్రామం నుండి బోనాలతో వచ్చిన మహిళల్ని పోచమ్మ దేవాలయం వద్దకు రానివ్వకుండా తిరిగి పొంపించగా తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మంగళవారం తెల్లవారుజామున కూనవాని పల్లెకు చెందిన గ్రామ ప్రజలు మహిళలు గన్నేరువరం – గుండ్లపల్లి రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం తెలిపారు. సర్పంచి పదవిలో ఉండి ప్రజలను ఒక్క కన్నుతో చూడడం సరైనది కాదని, ప్రజలను పట్టించుకోని సర్పంచ్ వద్దంటూ నక్క మల్లయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు గ్రామ ప్రజలు మహిళలతో కలిసి ఇంచార్జ్ ఎంపీడీవో నరసింహారెడ్డి, ఎమ్మార్వో రమేష్ ఎస్ఐ ఆవుల తిరుపతి లకు వినతి పత్రం అందించారు. సర్పంచ్ నక్క మల్లయ్యను వివరణ అడగగా ఆ గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదని విలేఖర్లకు తెలిపాడు ఈ విషయంపై చాకలివానిపల్లె గ్రామపంచాయతీ వద్ద ఇరువర్గాల పై విచారణ జరిపినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఈ కార్యక్రమంలో కూనవాని పల్లె చెందిన గ్రామ ప్రజలు మహిళలు యువకులు ఉన్నారు