కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం శుక్రవారం రాత్రి సుమారు 1:00 సమయంలో చొక్కారావుపల్లె బిక్కు వాగులో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన ఇసుక మాఫియా ట్రాక్టర్ల యజమానులు ,, కూలీలు మరియు చొక్కారావు పల్లె ట్రాక్టర్ల యజమానులు కూలీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఘర్షణ ఏర్పడింది. సమాచారం అందుకున్న గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి చేరుకొని ట్రాక్టర్లను అడ్డుకోవడం తో ట్రాక్టర్ యజమానులు కూలీలు లు దాడికి దిగి ఎస్సై కారు అద్దాలు పగుల గొట్టారు , ఎస్సై చొక్కారావు పల్లె సర్పంచ్ ముస్కు కర్ణాకర్ రెడ్డి , ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి కి సమాచారం ఇవ్వగా … అక్కడికి చేరుకున్న వారిపై కూడా దాడి చేసి కారు అద్దాలు పగుల గొట్టడం జరిగింది . దింతో ఆగ్రహించిన చొక్కారావుపల్లె గ్రామస్తులు పొలిసు అధికారి పై స్థానిక నాయకుల పై దాడిని ఖండిస్తూ బిక్కువాగు వద్ద ధర్నా కి దిగారు.