COVID వలన 50 శాతం సామర్థ్యంతో మాత్రమే దేశంలోని సినిమా థియేటర్లు తెరుచుకుంటోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి తగ్గడం, వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండడంతో 100 శాతం సామర్థ్యంతో తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.దీనిపై మరోసారి సమీక్ష జరిపిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ రేపటి నుంచి థియేటర్లు పూర్తి స్థాయి సామర్థ్యంతో తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సినీ ప్రేమికులకు గుడ్‌న్యూస్ అని తెలిపారు. ఆయన చేసిన ప్రకటన పట్ల ప్రొడ్యూసర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది.కాగా, కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే దేశంలోని థియేటర్లు తెరుచుకుంటాయి. పరిశుభ్రత, మాస్కులు పెట్టుకోవడ వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. థియేటర్లలోకి వచ్చే ప్రేక్షకులందరి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది.