గత కొంతకాలంగా తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజా పరిస్థితుల నేపథ్యంలో మునుపటిలా చురుగ్గా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ రేపు విజయవాడ పర్యటనకు రానున్నారు. ఎల్లుండి జులై 7న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అనంతరం పార్టీలోని అంతర్గత పరిస్థితులపైనా పవన్ దృష్టి సారించనున్నారు.
