కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం: నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు నిజమైన స్వేచ్చ లభిస్తుందని మానకొండూర్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జి గడ్డం నాగరాజు పేర్కొన్నారు కేంద్రం ప్రవేశపెట్టిన రైతుబిల్లు -2020 వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై పార్టీ ముద్రించిన కరపత్రాలను మండల శాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ గ్రామంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే బిజెపి లక్ష్యమని తెలిపారు కేంద్రప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో రకాల నష్టాలు జరుగుతున్నాయని అన్నారు.ఐకెపి కేంద్రాల్లో జరిగే మోసాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు పండించిన సన్నరకాలకు క్వింటాల్ కు రూ.2500 ల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మద్దతుధర పట్ల స్థానిక టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,సీనియర్ నాయకులు బోనాల మోహన్,ప్రధాన కార్యదర్శి కిన్నెర అనీల్,గుండోజు సంపత్,పల్లె కుమార్,అన్నాడి రమణారెడ్డి,రేగూరి సుగుణాకర్,పాశం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.