contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తాం నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే: రామగుండం సిపి సత్యనారాయణ

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిది పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ అమలును పరిశీలించారు.కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను రామగుండం కమిషనరేట్ పరిధిలో కచ్చితంగా అమలు చేస్తామని సిపి సత్యనారాయణ పేర్కొన్నారు.

అనంతరం సిపి గారు మాట్లాడుతూ…నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దన్నారు.ఆస్పత్రులు,మెడికల్ షాపులు, మీడియా తో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలకు మాత్రమే లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉందన్నారు.

 ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్ గారు,పెద్దపల్లి ఏసిపి సారంగపాణి గారు,సిఐ ప్రదీప్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :