- లాక్ డౌన్ లో లేటెస్ట్ చోరీలు
- సత్తెనపల్లి పరిసరాల్లో కరోనా క్రైం
- రైతుల బైకులే లక్ష్యం కలకలం రేపుతున్న నయా టెండ్
మీకు టూవిలర్ ఉందా.పని మీద పొలానికో బయటికో వెళ్ళి ఎక్కడన్నా బైకును పార్క్ చేస్తున్నారా.అయితే మీరు జాగ్రత్త.లాక్ డౌన్లో లేటెస్ట్ చోరిలు జరుగుతున్నారు కరోనా..క్రైం కు బ్రేకప్ ఇస్తే.!దొంగలు నయా పంధాలో చోరీలకు పాల్పడుతున్నారు .బైకు చోరిలలో కొత్త నేర చాతుర్యాలను చూపించి వాహనదారులకు షాకులిస్తున్నారు. పార్క్ చేసిన బైకులను కదిలించకుండా అందులోని స్పేర్ పార్ట్స్ ను కాజేస్తున్నారు. ఈ చోరిలకు రైతులను వాహనాలను లక్ష్యంగా చేసుకుని వారి ద్విచక్ర వాహనాలను దోచేస్తున్నారు.ఈ తరహ చోరీలు ఇప్పుడు సత్తెనపల్లి పరిసరాల్లో కలకలం రేపుతున్నాయి.
లాక్ డౌన్ అమలుతో అంతాట పోలీసు చెక్ పోస్టులు బందోబస్తులు పటిష్టంగా ఉండటంతో దోంగలు కొత్త రూట్ చోరీలు చేస్తున్నారు. బైకుల అపహరణ తరలింపు ఇబ్బందిగా మారటంతో
స్పేర్ పార్ట్స్ అపెన్స్ లకు పాల్పడుతున్నారు. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం చెందిన దాసరి రవి అనే రైతు కూలీ తన సహచరులు మరో ముగ్గురితో కలసి ఇటీవల మిర్చికోతలకు సత్తెనపల్లి(మం)లక్కరాజుగార్లపాడు పోలం పనులకు వెళ్ళాడు.అందరు కలసి బైకులను ఓచోట పార్క్ చేసి పనిలో నిమగ్నమయ్యారు. పని పూర్తి అయ్యాక వచ్చి చూసేసరికి రవి ద్విచక్ర వాహనం అపహరణకు గురికాగా మరో ఇద్దరి వాహనాల విడిభాగాలు చోరీ అయ్యాయి.అపహరణకు గురైన రవి టూవిలర్ ఛాంబర్ వదిలి స్పేర్ పార్ట్స్ నుఎత్తుకెళ్లారు ఆగంతకులు. దమ్మలపాడుతో పాటుమరి కోన్ని గ్రామాల్లో ఈ తరహాచోరీలు జరిగినట్లుగా బాధితులు చెబుతున్నారు. లాక్ డౌన్ లో కొత్త రకంగా దొంగలు బైక్విడిభాగాలు కాజేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. బైకేసుకోని పోలంవెళ్ళాలంటేనే భయమేస్తోందని ఆవేదన చెందుతున్నారు
చోరీల పై దర్యాప్తు చెస్తున్నాం:డియస్పి బైక్ స్పేర్ పార్ట్ ల చోరీలపై ఫిర్యాదులు వస్తోన్నాయి. చోరిల పై విచారణ చేపట్టామని త్వరలోనే దొంగలను అరెస్ట్ చేస్తామన్నారు సత్తెనపల్లి డియస్పి విజయభాస్కర రెడ్డి