కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామ పంచాయితి కార్యాలయానికి మంజూరైన ట్రాక్టర్ను బుధవారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బోయిని కొమరయ్య, వచ్చునూరు సర్పంచ్ ఉప్పులేటి ఉమారాణి మరియు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.