contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“వాలిమై” ఫస్ట్ లుక్

తల అజిత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “వాలిమై” ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ ఒక్కటే కాకుండా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ అభిమానులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ కిరాక్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లో కవ్విస్తున్న యాక్షన్ సన్నివేశాలను చూసిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాము ఇంతకాలం నిరీక్షినందుకు ఇదొక మంచి గిఫ్ట్ అని ఫీల్ అయిపోతున్నారు. ఇంకేముంది ఇంతకాలం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తన అభిమాన నటుడికి సంబందించిన సినిమా ఫస్ట్ లుక్ విడుదలవ్వడం, ఫ్యాన్స్ సైలెంట్ గా ఉండడం జరిగే పనేనా…! “వాలిమై’ ఫస్ట్ లుక్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల వేట మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇండియాలోని మోస్ట్ అవైటెడ్ మూవీస్ రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది “వాలిమై” ఫస్ట్ లుక్ మోషన్ మోస్టర్. దేశవ్యాప్తంగా హైయెస్ట్ లైక్స్ పొందిన మోషన్ పోస్టర్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది.

అ యితే ఇక్కడ దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్”, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తునం రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” చిత్రాల రికార్డులను కూడా “వాలిమై” దాటేయడం విశేషం. “వాలిమై” మోషన్ పోస్టర్ విడుదలైన 16 గంటల్లోనే 1 మిలియన్ కు పైగా లైకులు సాధించి ఈ హిస్టరీని క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానంలో కూడా అజిత్ చిత్రమే ఉండడం విశేషం. 555కే లైకులతో రెండవ స్థానంలో అజిత్ నటించిన “విశ్వాసం” మూవీ నిలిచింది. 467 లైకులతో “రాధేశ్యామ్” మూడవ స్థానంలో, 463కే లైకులతో ‘ఆర్ఆర్ఆర్’ నాలుగవ స్థానంలో నిలిచింది. అయితే 5వ స్థానంలో మాత్రం “రాధేశ్యామ్” హిందీ వెర్షన్ 443కే లైకులతో నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న “వాలిమై” ఫస్ట్ లుక్ మరిన్ని రికార్డులను కొల్లగొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలయ్యింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :