కరోన బాధితుల కోసం సీఎం సహాయానిధికి విక్రమ సింహపురి యూనివర్సిటి కాంట్రాక్ట్ బోధనేతర సిబ్బంది మరియు కావలి పి.జి సెంటర్ బోధనేతర సిబ్బంది తమవంతు సహాయంగా ఒక రోజు వేతనాలని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా” యల్ వి కృష రెడ్డి గారిని కలిసి ఒక రోజు వేతనాన్ని సిఎం సహాయనిధికి అందించాలని కోరుతూ కాంట్రాక్ట్ బోధనేర సిబ్బంది ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లేఖను అందించారు.కాంట్రాక్ట్ బోధనేర సిబ్బంది ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,కార్యదర్శి,సహాయ కార్యదర్శి, కావలి పి.జి.సెంటర్ ప్రతినిధులు, రాము,సాగర్,నిర్మల,పద్మ,వేణు,సీతమ్మ, బాలసుబ్రహ్మణ్యం,రాబ్బాని బాషా,మరియు సతీష్,రమణయ్య,సురేష్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు