ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శారదా పీఠం ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహా యాగం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు చేశారు.. అనంతరం గోమాత, జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శారదాపీఠంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్నారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని స్వీకరించారు.