నెల్లూరు జిల్లా: జాతీయ ఓటరు దినోత్సవ సందర్భముగా , విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం మరియు రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తముగా భారీ ర్యాలీ ని వి ఆర్ కాలేజీ నుంచి గాంధీ బొమ్మ మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ఓటు విలువైనదని ప్రతిఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. యువతకు ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు, దేశ భవిష్యత్తులో వారిని భాగం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఓటర్స్ డేకు రూపకల్పన చేశారని అన్నారు ఈ సంవత్సరం “ఓటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత కల్పిస్తూ, సమాచారాన్ని అందించటం” (Making our voters empowered, vigilant, safe and informed) అనే అంశముతో ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేపట్టమని సూచించిందని తెలిపారు ఈ కార్యక్రమక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, యన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి డా. కె. సునీత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్ , డా. ఆర్ మధుమతి ప్రోగ్రాం అధికారులు డా. విజయ, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకిశోర్ , డా. సునీల్, డా. గోవింద్ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, జగన్స్ కాలేజీ, చంద్రా రెడ్డి డిగ్రీ కళాశాల మరియు జెన్ఎక్స్ డిగ్రీ కళాశాల నుంచి సుమారు 350 మంది విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొని ఓటరు నమోదు పై అవగాహన కల్పించారు