నెల్లూరు జిల్లా:విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఇన్చార్జి ఉపకులపతి శ్రీ ఆచార్య చంద్రయ్య గారు ప్రారంభోపన్యాసం చేశారు
విద్యార్థులనుద్దేశించి విశ్వవిద్యాలయ ఉప కులపతి మాట్లాడుతూ విద్యార్థులు ఎలా వ్యవహరించాలి విశ్వవిద్యాలయంలో పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి B.సత్యనారాయణ గారు విద్యార్థులు కు రాగింగ్ సంబంధించిన చట్టాల పై వాటికి సంబంధించిన సెక్షన్స్ మరియు శిక్షణ ల పైన సుదీర్ఘమైన అవగాహన కల్పిస్తూ,విద్యార్థులు నేర పరమైన అంశాల లోకి పాల్గొనకుండా సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవా సంస్థ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ M శ్రీనివాసులు నాయక్ గారు ప్రసంగిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలను మరియు లోక్ ఆధాలత్ వాటిని ఉపయోగించుకునే సౌకర్యాలను గురించి వివరంగా తెలియజేశారు.
రిజిస్టార్ విజయ్ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు ఎటువంటి సమస్యనైనా తన దృష్టికి ఏ సమయంలో అయినా తీసుకురావచ్చని ముఖ్యంగా రాగింగ్ లాంటి సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తెస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమానికి విక్రమ సింహపురి యూనివర్సిటీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ CH విజయ గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ర్యాగింగ్ అవగాహన సదస్సు కన్వీనర్ S B సాయినాథ్ గారు మరియు ఆర్గనైజింగ్ కమిటీ డాక్టర్ హనుమ రెడ్డి గారు, డాక్టర్ R మధుమతి గారు డాక్టర్ జి మేరీ సందీప్ గారు ,అధ్యాపకులు ,పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు