contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వి ఎస్ యు లో స్వామి వివేకానంద 158 వ జయంతి వేడుకలు

 

కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో  జాతీయ సేవా  పథకం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు ముఖ్య అతిధిగా పాల్గొని  మరియు రిజిస్ట్రార్ గౌరవ అతిధిగా పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదనంతరం ఉపకులపతి మాట్లాడుతూ స్వామి వివేకానందుని జీవితమే ఒక సందేశమని, ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం అంటే అయన సందేశాన్ని, ఆయన అనుసరించిన మార్గాన్ని  అందరం నిత్యం  ఆచరించటమనే అన్నారు. అతి సామాన్యమాన కుటుంబంలో జన్మించి తన నిబ్బద్దతతో దృఢ సంకల్పంతో అత్యున్నత స్థాయికి ఎదిగి, కొన్ని కోట్ల మంది యువతకు ఆదర్శప్రాయుడైనాడని అన్నారు.  వివేకానందుని ఆంగ్ల  బాషా మీద  చక్కటి ప్రావీణ్యం కలిగిన ఆయన చికాగో లో జరిగిన  సదస్సులో అయన ప్రసంగం భారత దేశ ఔన్యత్యాన్ని పాశాత్యదేశాలకు తెలియియచేశారని అన్నారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోని పలుచోట్ల ఆధ్యాత్మిక సభల్లో పాల్గొని భారత దేశం గొప్పతనాన్ని .. సనాతన ధర్మాన్ని వెలుగెత్తి చాటారు. ముఖ్యంగా అమెరికాలో జరిగిన ప్రపంచ దేశాల మత సమ్మేళనంలో.. భారతదేశం తరుపున పాల్గొన్న స్వామి వివేకానంద ప్రసంగం ఒక సంచలనమే సృష్టించింది. ఆయన ప్రసంగ విశిష్టత గురించి ప్రపంచ దేశాల పత్రికలన్నీ ప్రముఖంగా రాశాయి అన్నారు.  తదనంతరం రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ఒక యుగ పురుషుడని అయన ఏ మతానికి సంబందించిన వ్యక్తి కాదని అయన ఆచరించిన  పద్ధతులే ఉదహరించిన మాటలని అన్నారు. స్వామి వివేకానంద.. ఈ పేరు వింటేనే . ఉత్సాహం తట్టి లేపుతుంది. ప్రపంచమంతా భారత దేశంవైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి.. ఓ శక్తి స్వామి వివేకానంద. ఆయన సూక్తులు విని, ఆచరించినవారు ఎంతటి బద్దకస్థులైనా జీవితంలో సక్సెస్ అయినవారు ఎంతోమంది ఉన్నారు.అన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సాయిప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి. సుజయ్, NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఉదయ్ శంకర్ అల్లం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :