contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

వి యస్ యూనివర్సిటీ జాతీయ సేవ పథకం యూనిట్ 2 నిర్వహించిన స్పెషల్ క్యాంపు

 వి యస్ యూనివర్సిటీ జాతీయ సేవ పథకం యూనిట్ 2  నిర్వహించిన స్పెషల్ క్యాంపులో చెముడుగుంటలోని మాగుంట  రాఘవ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల 9వ  తరగతి మరియు 10వ తరగతి పిల్లలు వివిధ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో 23 మంది పిల్లలు కరోనా వ్యాప్తి – నివారణ మరియు శుభ్రమైన,పచ్చటి వాతావరణానికి యువత పాత్ర అనే అంశాలపై  వ్యాసరచన మరియు ఉపన్యాసం లో పాల్గొన్నారు. ఇందులో 12 మంది  ఎంపిక అయ్యారు.ఎంపిక అయిన పిల్లలకు ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారి చేతుల మీదుగా బహుమతులను అందించడం జరిగింది.ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయ ఉపకులపతి గారి చేతులు మీదుగా బహుమతులు తీసుకోవడం ఎంతో ఆనందదాయకంగా భావించారు.అదేవిధంగా ఆచార్య రొక్కం సుదర్శన రావు గారిని విద్యార్థిని విద్యార్థులు వారి ఆనందాన్ని పులమాలతో సత్కరించి పాదాభివందనం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చెముడుగుంట గ్రామంలోని గ్రామ పెద్దలు మరియు సచివాలయాల దగ్గర విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు కరోనా పై అవగాహన, రక్తహీనత,HIV మరియు అదేవిధంగా చుట్టు ప్రక్కల మరుగు ప్రాంతాలను బ్లీచింగ్,సున్నన్ని చల్లి శుభ్రపరిచారు.ఇలాంటి కార్యక్రమాన్ని విద్యార్థి దశలోనే చేపట్టారని విశ్వవిద్యాలయ ఉపకులపతి హర్షం వ్యక్తం చేశారు.అలాగే విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా ఎల్ వి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థుల వల్లే సమాజానికి మరియు వెనుకబడిన ప్రాంతాలకు ఎన్నో విషయాలను అవగాహన సదస్సుల ద్వారా తీసుకువెళ్లడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గత రెండు రోజులుగా నిర్వహించినందుకు జాతీయ సేవ పథక కార్యనిర్వహకులైన డా వై.విజయ గారిని అభినందించారు.ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో విశ్వవిద్యాలయం నుండి జరగాలని రెక్టార్ ఎం.చంద్రయ్య గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు 60 మందికి పైగా భౌతిక దూరాన్ని పట్టిస్తు గ్రామంలో ర్యాలీని చేపడుతూ గ్రామస్థులకు అవగాహన కల్పించారు.


   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :