నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు,మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ కె. దినేష్ కుమార్ రాష్ట్ర బయో డైవర్సిటీ బోర్డు మెంబెర్ సెక్రటరీ శ్రీ డి నళిని మోహన్ మరియు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వి కె శనుముఖ్ కుమార్ గారు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా పలు కీలక అంశాల పై దీర్ఘంగా చర్చ కు వచ్చాయి. విశ్వవిద్యాలయానికి బయో డైవర్సిటీ పార్క్ కాని బొటనికల్ గార్డెన్ కానీ నిర్మించడానికి సహకరించాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి గారు కోరారు. ఈ అంశం పై బయో డైవర్సిటీ బోర్డు తరుపున తాను విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతయినా సహకరిస్తానని తెలుపుతూ రిజిస్ట్రార్ ప్రతిపాదన పైన సానుకూలంగా స్పందించారు మరియు స్థల పరిశీలన చేసారు. అలాగే విశ్వవిద్యాలయం ఎంతోకాలంగా ఎదురుకొంటున నీటి సమస్య దానికి కావాల్సిన వాటర్ పైప్ లైన్, విశ్వవిద్యాలయానికి వెనుక వున్న వేస్ట్ డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న వాసనకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు మరియు భవనాలు లేని ఎద్దడి కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్ గారికి రిజిస్ట్రార్ గారు వివరించడమైనది. ఈ అంశాల ఫై త్వరిత గతిని చర్యలు తీసుకొని విద్యార్థులకు చదువుకొనే సానుకూల వాతావరణం నెలకొలుపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజా యస్ నాయర్, జాతీయ సేవ పథకం సమన్వయకర్త ఉదయ్ శంకర్ అల్లా,డా కె.సునీత, డా ఆర్ మధుమతి,పరీక్షల నియంత్రణ అధికారి సాయి ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.