కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో వ్యవసాయ అధికారి ని యాస్మిన్ తో కలిసి నేలకొరిగిన వరి పంటలను తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి బుధవారం పరిశీలించారు
ఈ సందర్భంగా జోజి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో రైతుల నడ్డి విరుస్తోందని, రైతులచే ప్రభుత్వం నిర్బంధ సాగు చేయిస్తుందన్నారు. సన్న రకం వడ్లు సాగు చేస్తేనే రైతుబంధు పథకం వర్తిస్తుందని ప్రభుత్వం రైతులతో నిర్బంధంగా సాగు చేయిస్తోందని, ప్రభుత్వం చెప్పిన సన్న రకాల వడ్లను పండిస్తున్న రైతుల పొలాల్లో చూస్తే వరి పిలకలు వచ్చిన తర్వాత ప్రభుత్వం చెప్పిన తెలంగాణ సోనా, ఆర్ ఎన్ ఆర్ వంటి రకాలకు తెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎకరాకు ఒక బస్తా మాత్రమే దిగుబడి వస్తుందని, అదే దొడ్డు సాగు చేసుకుంటే రైతుకు దిగుబడి ఎక్కువగా ఉండేదని దుయ్యబట్టారు.దోమ పోటు, మెడ విరుపు రోగం,కర్ర నల్లి లాంటి తెగుళ్లతో పంట పూర్తిగా నేల కొరుగుతోందన్నారు. గతంలో అకాల వర్షాలు, తెగుళ్లతో నష్టపోయి ఉన్న రైతులకు ఈ నిర్బంధ సాగు పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టేసిందన్నారు. పొలంలో గొలకలు వచ్చే సమయానికి ధాన్యం పూర్తిగా నల్లబడి తాళు గా మారుతోందని, ప్రభుత్వం చెప్పిన సన్న రకాలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు రైతులకు పెట్టుబడికి ఎకరాకు 50 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని, నష్టపోయిన రైతులకు ఎకరా కి 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని జోజిరెడ్డిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో జోజిరెడ్డి వెంట రామడుగు మండల పార్టీ అధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్, నియోజకవర్గ బాధ్యుడు జంగం అంజయ్య, నీటి సంఘం మాజీ చైర్మన్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి బీెరెడ్డి కరుణాకర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, నారాయణ తోపాటు పలువురు రైతులు పాల్గొన్నారు