శంషాబాద్: ఠాగూర్ సినిమాలో మాదిరిగా చనిపోయిన వ్యక్తి శవానికి హాస్పిటల్ సిబ్బంది వైద్యం చేసిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిడేంట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిడేంట్ హాస్పిటల్ వైద్యులు దారుణంగా ప్రవర్థించారు. చనిపోయిన శవానికి హాస్పిటల్ సిబ్బంది వైద్యం చేసినట్లు నటించారు. గత నాలుగు రోజుల కిందట షాద్ నగర్ కు చెందిన మధు క్రిమికీటకాల మందు తాగడంతో సమీప ఆస్పత్రికి తరలించారు బంధువులు. అక్కడి వైద్యులు ఉస్మానియాకు రిఫర్ చేయడంతో బతుకుతాడేమోననే ఆశతో శంషాబాద్ లోని త్రిడేంట్ హాస్పిటల్ కి తీసుకు వచ్చారు బంధువులు. తీరా చూస్తే… నాలుగు రోజుల నుండి చనిపోయిన శవానికి వైద్యం చేశారంటూ హాస్పిటల్ ముందు చనిపోయిన వ్యక్తి బంధువులు ధర్నాకు దిగారు.