కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ పారా బాయిల్డ్ రైస్ మిల్ యాజమాన్యము కాలుష్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, శంకరపట్నం మండల తహశీల్దార్ శ్రీనివాస రావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రవిదాసు, ఏఈ సుభాష్ ఈరోజు మిల్లు తనిఖీ చేశారు, అట్టి మిల్లుపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని, వారం రోజుల్లోగా కాలుష్య నియంత్రణ యంత్రాలను అమర్చుకోవాలని, నిబంధనలను పాటించాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు లేనిపక్షంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు, ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, నాయకులు బొజ్జ రవి, శ్రీనివాస్, మిల్లు యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.