భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలో రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో బోయిని తిరుపతి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం మానకొండూరు నుంచి ముంజంపల్లి పోరండ్ల మీదుగా మొగిలిపాలెం రేకొండ గ్రామాల కలుపుకొని హుస్నాబాద్ వరకు డబల్ రోడ్డు వేయడం జరిగింది
అప్పుడే పొలంపల్లి గ్రామంలో రోడ్డు వేయలేదు మట్టి రోడ్డును అలాగే వదిలి పెట్టినారు. అప్పటినుండి ఇప్పటివరకు పొలంపల్లి గ్రామం రోడ్డు లేక దుమ్ము ధూళితో అద్వానంగా ఉంటూ వచ్చింది రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు దుర్భర జీవితాలు అనుభవించారు ఇప్పుడు గ్రామంలో మళ్లీ రోడ్డు పనులు మొదలు పెట్టినారు
కానీ కాంట్రాక్టర్లు మాత్రం సింగిల్ రోడ్ పోస్తామని కంకర వేయడం జరిగింది ఇదేమని ప్రశ్నించగా మాకు ఇంత వరకే ఆర్డర్స్ ఉన్నాయి అని సమాధానం ఇస్తున్నారు మరి పక్కనున్న మన్నెంపెల్లి. మల్లాపూర్. మొగిలి పాలెం. రేకొండ. గ్రామాలలో డబల్ రోడ్డు ఉండి.పొలంపెళ్లికి ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తున్నారు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులురసమయి బాలకిషన్ దీని మీద ఎందుకు దృష్టిసారిస్తలేరని అడుగుతున్నాము ఇకనైనా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొనిరెండు రోజులలో R&B అధికారులకు డబల్ రోడ్డు పోసేలా ఎమ్మెల్యే కృషిచేయాలని కోరుచున్నాము
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి మేకల శ్రీనివాస్. సహాయ కార్యదర్శి ఎల్లస్వామి. సిపిఐ సీనియర్ నాయకులు కొమురెల్లి. ఈ కొమురయ్య. గట్టయ్య. యువకులు ఏ శేఖర్. పి స్వామి, పి రాజు తదితరులు పాల్గొన్నారు