జగన్ ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ను వెతిరేకిస్తూ గుంటూరులో నిరుద్యోగులు రోడ్డెక్కారు . పోలీస్ శాఖలో వేలాది ఖాళీలు ఉన్నా జాబ్ క్యాలండర్ లో చూపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు . ప్రతి ఏటా నోటిఫికేషన్ అంటూ ఎన్నికలముందు హామీలిచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు . ఖాళీగా ఉన్న జాబ్ వెకెన్సీలను వెంటనే ప్రకటించాలని ర్యాలీ చేసారు . ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలైతే.. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల హామీలో ప్రకటించిన లక్ష 42 వేల ఉద్యోగ ఖాళీలు ఎటుపోయాయి అని ప్రభుత్వానికి ఎదురుతిరిగారు.
ఏటా 6వేల చొప్పున మూడేళ్ల పాటు 24వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాటలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించింది ఏపీ నిరుద్యోగ జేఏసీ. 470 పోలీస్ ఉద్యోగాలను రోస్టర్ విధానంలో చూసినా కులానికి 50 ఉద్యోగాలు కూడా లేవని ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతున్నారు.పోలీసు శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉంటే 470 పోస్టులకు ప్రకటించి ఏం సాధిద్దామనుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీలోని నిరుద్యోగులు. 25 వేల డీఎస్సీ టీచర్ల పోస్టులు ఉంటే.. కనీసం చెప్పుకోడానికైనా ఒక్క ఖాళీని కూడా నింపలేదని మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఒక చీటింగ్ క్యాలెండర్ అని, మాయమాటలు, అంకెల గారడీ మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శిస్తున్నారు నిరుద్యోగులు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 39 రద్దు చేసి కొత్త జాబ్ క్యాలండర్ ను విడుదల చేయాలనీ నిరుద్యోగులు డిమాండ్ చేసారు.