కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో రూ. 9 లక్షల నిధులతో చేపట్టిన సైన్స్ ప్రయోగశాల గదికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో జెడ్పిటిసి సర్పంచి పుల్లెల లక్ష్మి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ప్రతినిధులతో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు మండల కేంద్రంలోని ఈదులకుంటలో ఇటీవల కాలువల ద్వారా కాలేశ్వరం జలాలతో నిండి మత్తడి దూకడంతో పూజలు చేశారు ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు