కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బామాండ్ల బాబు ఏప్రిల్ 24వ తేదీన గుండెపోటుతో సౌదీలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న జిడబ్ల్యూ ఏసీ శాఖ ఆధ్వర్యంలో మృతదేహాన్ని శుక్రవారం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పంపించారు జిడబ్ల్యూ ఏసీ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని ఇంటికి పంపించారు ఇంటికి చేరుకున్న మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు , ఎన్ఆర్ఐ పాలసీ నాయకులు మాట్లాడుతూ బామండ్ల బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాబుకు ముగ్గురు కూతుర్లు వివాహం చేసేంతవరకు దేశంలో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించాడు, తొమ్మిది సంవత్సరాల నుండి ఇంటికి వెళ్లలేదని ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులు స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాల ఆదుకోవాలని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కోరారు.