contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి పతకాలు

 

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు రవిశంకర్ అయ్యన్నార్ (శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ), కుమార్ విశ్వజిత్ (హోం శాఖ ముఖ్య కార్యదర్శి)లు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. అలాగే, రాష్ట్రానికి చెందిన మరో 14 మంది పోలీసులు, ఇతర విభాగాల వారికి పోలీసుల పతకం (పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్  సర్వీసెస్) లభించింది.  వీరిలో లింగంపల్లి వెంకట శ్రీనివాసరావు (అదనపు ఎస్పీ, సీఐడీ, విశాఖపట్టణం), ఎన్ వెంకటరెడ్డి (ఆర్‌వీఈవో, విజయవాడ), ఎన్నమనేని సత్యసాయి ప్రసాద్ (అదనపు కమాండెంట్, ఏపీఎస్పీ ఆరో బెటాలియన్, మంగళగిరి), కల్వకుంట్ల ఈశ్వర్‌రెడ్డి (ఎస్‌డీపీవో, చిత్తూరు), మరిశెట్టి మహేశ్‌బాబు (అసిస్టెంట్ కమాండెంట్, ఎస్ఏఆర్‌సీపీఎల్, ఆంధ్రప్రదేశ్), వైద్యభూషణ నేతాజీ (ఎస్సై, శ్రీకాకుళం), సిరిమల్ల సర్హకుమారి (ఎస్సై, పీసీఆర్, ఒంగోలు), కంచర్ల వకలయ్య (ఏఆర్ ఎస్సై, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు, మచిలీపట్టణం), మందలపు వెంకటేశ్వరరావు (ఏఆర్ఎస్సై, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు, విజయవాడ), శ్రీనివాసులు (ఏఆర్ ఎస్సై, పీటీసీ, అనంతపురం), కంబేటి గురవయ్యబాబు (ఏఆర్ హెచ్‌సీ, సీటీ ఆర్మ్‌డ్ రిజర్వు, విజయవాడ), రంగారావు (హెడ్ కానిస్టేబుల్, ఏసీబీ, విజయవాడ), అట్ల సూర్యనారాయణరెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు, విజయవాడ), దూదేకుల మౌలాలి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ విభాగం, ఆంధ్రప్రదేశ్) ఉన్నారు.అలాగే, సీఐఎస్‌ఎఫ్ నుంచి జె.మోహనన్ (ఏఎస్సై, ఎస్‌డీఎస్‌సీ షార్ శ్రీహరికోట, నెల్లూరు), సీఆర్పీఎఫ్ నుంచి కేవీ కురియాకోస్ (డిప్యూటీ కమాండెంట్, 198, బీఎన్, విశాఖపట్టణం), గణేశ్‌బాబు సింగ్ చవాన్ (అసిస్టెంట్ కమాండెంట్, 234, బీఎన్ విశాఖపట్టణం), సీపీ శ్రీధరన్ (ఎస్సై, జీడీ, 42, బీఎన్, రాజమహేంద్రవరం) ఉన్నారు. హోంశాఖ నుంచి వరప్రసాద్ వెంకట రామసత్యనారాయణ (రాంబరికి, ఐసీఐవో-2, ఎస్ఐబీ, విజయవాడ)తోపాటు జైళ్ల శాఖ సిబ్బందిలో ముగ్గురు పోలీసుల పతకానికి ఎంపికయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :