కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెళ్ళ గ్రామంలో స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపల్లి రమేష్ ఆధ్వర్యంలో 130వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎసిఎస్ చైర్మన్ అల్వాల కోటి, గన్నేరువరం మండల ఎస్సై ఆవుల తిరుపతి మరియు గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి హాజరైనారు పిఎసిఎస్ చైర్మన్ కోటి మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడుస్తూ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం యువత మీదే ఆధారపడి ఉన్నది యువత అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని యువకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపల్లి రమేష్, వార్డు సభ్యులు బండి పల్లి సంతోష్, చెక్కిళ్ళ తిరుపతి, అంబేద్కర్ సంఘం నాయకులు గువ్వల రాజ్ కుమార్, లింగంపల్లి శ్రీకాంత్, కారోబార్ గువ్వల లక్ష్మణ్, స్వేరోస్ మండల అధికార ప్రతినిధి లింగంపల్లి ప్రశాంత్, స్వేరోస్ గ్రామ అధ్యక్షులు గజ్జల శంకర్, ఉపాధ్యక్షులు ఎదురు గట్ల సురేష్, స్వేరోస్ నాయకులు మహంకాళి మధుకర్, అనిల్, గువ్వల వేణు, ఎదురు గట్ల తిరుపతి, లింగం పెళ్లి సజయ్, మహంకాళి రంజిత్, లింగంపల్లి అరుణ్ కుమార్, నసుకుట్ల విష్ణు, ఇల్లందుల హరీష్, తదితరులు పాల్గొన్నారు.