కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లె గ్రామంలో మంగళవారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు ఇప్పటివరకు మండలంలో మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు రేపు బుధవారం రోజు హన్మజీపల్లె గ్రామానికి వైద్య బృందం రానుంది గ్రామ ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా వ్యాధి సోకిన వారిని ఆసుపత్రికి తరలిస్తామని వైద్య అధికారులు తెలిపారు