లాక్‌డౌన్‌కు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఇవ్వడంతో అప్పుడు మెట్రో కూడా అప్పటి రిలాక్సేషన్ సమయానికి అనుగుణంగానే నడిచింది. మలివిడత లాక్‌డౌన్ విధించినప్పుడు రిలాక్సేషన్ సమయం మరో మూడు గంటలు పెరిగింది. ఈ క్రమంలోనే మెట్రో సమయం విషయంలో కూడా మార్పు చేశారు. తాజాగా రేపటి నుంచి రిలాక్సేషన్ సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. దీని ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఉండనుంది. అలాగే ఉద్యోగస్తులు ఇళ్లకు చేరేందుకు మరో గంట అదనంగా సమయం ఇచ్చింది. దీనికి అనుగుణంగానే రేపటి నుంచి మెట్రో సర్వీసుల సమయం పెరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించనుంది. సాయంత్రం చివరి మెట్రో రైలు 5 గంటలకు బయలుదేరనుంది.