contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పసివాడిని వెంటాడిన నాగుపాము – ఈ వీడియో చూస్తే హడలిపోతారు

ఇంటి బయట ఆడుకున్న పసివాడిని లక్ష్యంగా చేసుకుని ఓ నాముపాము వేగంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో చూస్తే హడలిపోతారు.

పామును చూస్తే గుండె ఝల్లుమంటుంది కదూ. పైగా పైగా నాగుపాము వంటి విషపూరిత సర్పం ఎదురైతే సగం ప్రాణాల్లో గాల్లో కలిసిపోతాయి. ఈ వీడియో చూసిన తర్వాత పాములపై మీకు ఉండే భయం మరింత రెట్టింపు అవుతుంది. ఆ పాము వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
వియత్నాంలోని సాక్ తాంగ్ గ్రామంలో ఓ పిల్లాడు ఇంటి వరండాలో నేల మీద కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఓ నాగుపాము అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. పామును చూడగానే ఆ పసివాడి తాత హడలిపోయాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఇంటి లోపల మొబైల్‌తో టైంపాస్ చేస్తున్న వ్యక్తి.. పామును చూసి బయటకు పరిగెట్టాడు. వెంటనే పసివాడిని పట్టుకుని ఇంట్లోకి వెళ్లి తలుపులు మూశాడు.

పాము రెప్పపాటు వేగంతో ఆ తలుపు వద్దకు చేరింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ, సాధ్యం కాలేదు. యూట్యూబ్‌లోని వైరల్ హగ్ పేజీలో పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :