దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. 11 రౌండ్లుగా వెనుకబడిపోయిన కాంగ్రెస్ పార్టీ 12వ రౌండులో ఎట్టకేలకు ఆధిక్యతను సాధించింది. ఈ రౌండులో అధికార టీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. 12వ రౌండులో బీజేపీకి 1,997 ఓట్లు, టీఆర్ఎస్ కు 1,900 ఓట్లు పడగా… కాంగ్రెస్ కు అత్యధికంగా 2,080 ఓట్లు పడ్డాయి. దీంతో, ఈ రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి 83 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 12వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ 36,745 ఓట్లు సాధించగా… టీఆర్ఎస్ కు 32,715, కాంగ్రెస్ కు 10,662 ఓట్లు పడ్డాయి. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో టీఆర్ఎస్ ఈ రౌండులో మూడో స్థానానికి పరిమితమైంది.