సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా :భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ పిలుపుమేరకు ఈరోజు బెజ్జంకి మండలంలో 16 గ్రామాలలో సేవా హీ సంఘటన కార్యక్రమాన్ని అయా గ్రామాల ఇంఛార్జి ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జరిగిందని మండల అధ్యక్షులు దోనె అశోక్ తెలిపారు. ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ సిబ్బందికి, నిరుపేదలకు, కరోనా రోగులకు శానిటైజర్, మాస్క్ ,పండ్లు, నిత్య అవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి నేటితో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అగ్రరాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతమైనాడు, నేడు కరోణ మహమ్మారి తో యావత్ ప్రపంచ మంతా అతలాకుతలమైన సందర్భం అయినప్పటికిని ప్రధాని నరేంద్ర మోడీ మొక్కవోని దీక్షతో దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు అని ప్రజల కు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దొంతరవేణి శ్రీనివాస్, కూర్మ నారాయణ రెడ్డి, వేముల స్వప్న, లింగాల లావణ్య,శీలం వెంకటేశం, వడ్లూరి శ్రీనివాస్ ,ఇస్కిల్ల సాగర్,నిమ్మ లక్ష్మణ్ రెడ్డి,భూర్గుల రాజు,వనపర్తి శివ సాయి, తదితరులు పాల్గొన్నారు.