భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించిన మంత్రి.
మంత్రి పర్యటన వివరాలు;
◆ భుర్గంపాడ్ మండలం, సారపాక గ్రామం మరియు భద్రాచలం మండలం, భద్రాచలం గ్రామాల్లో 6 వ విడత హరితహారంలో బాగంగా మొక్కలు నాటిన మంత్రి.
◆ చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో రూ.1.19 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 10పడకల వార్డ్, సిబ్బంది నివాస సముదాయం ప్రారంభోత్సవం.
◆ చర్ల మండలం లక్ష్మీ కాలనీలో రూ. 3.77 కోట్లతో నూతనంగా నిర్మించిన 65 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభోత్సవం.
◆ చర్ల మండల కేంద్రంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన.
◆ చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభోత్సవం.
◆ దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇళ్ళు ప్రారంభోత్సవం.
◆ దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన.
◆ దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో రూ.2.80 కోట్లతో చిన్న గుబ్బల వాగుపై నిర్మించిన హై లెవెల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన.
◆ దుమ్ముగూడెం మండలంలో రూ.9 కోట్లతో పెద్ద నల్లబెల్లి నుండి CRPF బేస్ క్యాంప్ రోడ్ బీటీ రోడ్ (బ్లాక్ టాప్) ప్రారంభోత్సవం.
◆ దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబెల్లి నుండి జిన్నలగూడెం రోడ్ వరకు రూ.8.40 కోట్లతో నిర్మించిన బీటీ(బ్లాక్ టాప్) రహదారి ప్రారంభోత్సవం.
◆ దుమ్ముగూడెం మండలం నర్సాపురం(కె మారేడుబాక) గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఉప కేంద్రం మరియు అంగన్ వాడి కేంద్రంను ప్రారంభోత్సవం.
◆ జూలురుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో 1.20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 33/11kv విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన.
ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటుగా తెలంగాణ ప్రభత్వం విప్ రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ కవిత, ఉమ్మడి ఖమ్మం జిల్లా MLC బాలసాని, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మండలాల వారీగా అధికారులు, తెరాస నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.