contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 8 కిలోమీటర్ల ర్యాలీ

విశాఖపట్నం :  గ్రేటర్ విశాఖపట్నం సాయిరాం నగర్ హై స్కూల్ రోడ్ గాజువాక. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిటీ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివిధ రూపాలలో అనగా సభలు సమావేశాలు ర్యాలీలు ద్వారా పొగాకు ఉత్పత్తుల నుండి జరిగే నష్టాలను వివరించాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్వామి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు స్కౌట్స్ మరియు గైడ్స్ & కబ్స్ మరియు బుల్బుల్స్ మరియు ఉపాధ్యాయులు తో పాటు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసినటువంటి విశాఖపట్నం రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి హేమలత గారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ తుంపాల శ్రీరామ్ మూర్తి గారు మొదట జండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఆ ర్యాలీ స్వామి విద్యానికేతన్ నుండి హై స్కూల్ రోడ్డు కలుపుతూ జింక్ స్మెల్టర్ గేటు వరకు అక్కడి నుండి కొత్త గాజువాకను కలుపుతూ పాత గాజువాక ఆటోనగర్ మీదుగా జాగవానపాలెం, అశోక్ నగర్, మారుతి నగర్, శంకర నగర్, సాయిరాం నగర్ ను కలుపుతూ మొదట మూడు కిలోమీటర్లు ర్యాలీగా భావించి పిల్లలు ఉపాధ్యాయులు వచ్చిన ముఖ్య అతిధులు ప్రోత్సాహంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించడంతోపాటు సుమారు 15 స్థలాల్లో సమావేశాలు లో పొగాకు ఉత్పత్తులు వల్ల వల్ల జరిగే నష్టాలను సమావేశాల్లో వివరించడం జరిగింది. అంతేకాకుండా దారి పురుగున పొగాకు ఉత్పత్తులు వల్ల జరిగే నష్టాలను వివరించే బోర్డులను చూపిస్తూ పొగాకు కాదు ఇది ప్రాణాలకు పగాకు మరియు మాకు ఆహారం కావాలి కానీ పొగాకు కాదు అనే థీమ్ వివరిస్తూ ర్యాలీ పొడవునా స్లోగన్ లతో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 67వ వార్డు మొత్తం ప్రతి వీధిని కలుపుతూ ప్రజలకు పొగాకు ఉత్పత్తులు వలన నష్టాలను వివరించారు స్వామి విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం ఇన్స్టిట్యూషనల్ కౌన్సిలర్ ( హెచ్ డబ్ల్యు సి స్కౌట్స్ ) డాక్టర్ పాలూరు లక్ష్మణ స్వామి గారి మాట్లాడుతూ గుండెకు ఊపిరితిత్తులకు మరియు శరీరంలోని వివిధ భాగాలలో వచ్చే 72 రకాల క్యాన్సర్లకు కారణమంటూ ప్రపంచ దేశాలలో ప్రతి సంవత్సరం సుమారు 70 లక్షల వరకు ఈ మహమ్మారి కారణంగా చనిపోతున్నారని చెబుతూ ఒక్క భారతదేశంలోనే 13.5 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారని అనేకమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరిస్తూ నిరక్షరాస్తులతోపాటు చదువుతున్న వారు దీనికి అలవాట పడుతున్నారని చెబుతూ దంత చిగుళ్ళు, నాలుక, గర్భం మొదలగునవి పొగాకు ఉత్పత్తులలో కైని, గుట్కా, పాన్ పరాగ్, సిగరెట్లు, బీడీలు, చుట్టాలు, ఈ సిగరెట్లు మొదలగు వాటి వలన గుండె ఊపిరితిత్తులు, సంతానలేమి సమస్యలు వస్తాయని దారి పొడవునా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి విశాఖపట్నం మెడికల్ రీజనల్ ఆఫీసర్ డాక్టర్ పి హేమలత గారు మాట్లాడుతూ పొగాకు వలన మెదడు రక్తనాళాలలో పూడిక వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుందని నికోటిన్ వల్ల గర్భాసయ క్యాన్సర్ ప్రమాదం ఉంటుందని పొగలోని విష పదార్థాలతో గాలి గొట్టాలు గదులకు కోలుకోలేని స్థాయిలో ప్రమాదం ఉంటుందని ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలు దెబ్బతినడం వలన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని గుండెపోటు కేసులలో 25 శాతం పొగ త్రాగే అలవాటే కారణం మరియు గర్భం దాల్చిన నెలలు నిండకముందే కాన్పు, గ్రహణం మోర్రి తో బిడ్డలు జన్మించే ఆస్కారం, గుట్కా కైని నోటి ద్వారా ప్లేగులోకి వెళ్లి పేగు క్యాన్సర్ కు ఆస్కారం ఉంటుంది మరియు ఇవి నమలడం వల్ల ఆకలి మందగించడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ తుంపాల శ్రీరామమూర్తి గారు మాట్లాడుతూ పొగాకులోని విషకారకాలు వల్ల రాగ నిరోధక వ్యవస్థకు ప్రమాదం ఉంటుందని పొగాకు వినియోగం కారణంగా లైంగిక సంపర్కం ద్వారా మగవారి కూడా హెచ్ పి వి సోకే ప్రమాదం ఉంటుందని పొగ త్రాగే వారికి శుక్రకణాలు దెబ్బతిని సంతానలేమి సమస్యలు ఆడవారు పొగాకు ను పీల్చితే గర్భం ధరించిన సమయంలో పిండం ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని కావున ప్రభుత్వాలు రైతులకు ప్రత్యామ్నాయ పంటలకు వివిధ సబ్సిడీల రూపంలో సహాయ సహకారాలు అందించినట్లయితే వారు వేరే పంటలపై దృష్టి సారించి ఈ మహమ్మారి పంటకు దూరంగా ఉండేటట్లు చేయవలసినటువంటి బాధ్యత పాలకులపై ఉంటుందని నొక్కు వక్కాణించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ పద్మజా గారు లక్ష్మీ గారు ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావు గారు కుమార్ గారు ఇమ్రాన్ గారు, సాయిరాం నగర్ పెద్ద వైయస్ జి ఆర్ నాయుడు గారు మరియు పాఠశాల పూర్వపు విద్యార్థులు ఇప్పటికే రాష్ట్రపతి అర్హత పరీక్షకి మరియు గవర్నర్ అర్హత పరీక్షకి హాజరైనటువంటి విద్యార్థులు కూడా పాల్గొన్నట్లు స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు తెలిపారు చివరగా స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు ఉదయం 8 గంటల నుండి 11:30 వరకు సుమారు మూడున్నర గంటల పాటు పాల్గొనడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా భావిస్తూ విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :