మేడికొండూరు. మేడికొండూరు మండల నూతన సీఐగా వాసు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో వాసు యాంటీ నక్సల్స్ స్క్వాడ్, భారత సరిహద్దు దళం,మంగళగిరి ప్రత్తిపాడు తాడేపల్లి నల్లపాడు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా,సీఐగా ఓల్డ్ గుంటూరు ట్రాఫిక్కు,సిసిఎస్ నందు పనిచేశారు.ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసు విషయంలో ముద్దాయికి ఉరిశిక్ష పడతంలో కీలక పాత్ర పోషించారు సీఐ వాసు.యూనియన్ హోమ్ మినిస్టర్ మెడల్, డిజిపి కమాండర్ మెడల్ ఇలా ఎన్నో సేవ పురస్కార అవార్డులు వాసుకు లభించాయి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో సిఐ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే నేరుగా తననే సంప్రదించాలని ఆయన అన్నారు.
