contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్ … కలలోనైనా ఊహించలేమంటూ ఆనంద భాష్పాలు.

  • దివ్యాంగులకు దిక్సూచి ఎమ్మెల్యే జిఎంఆర్
  • 3 కోట్ల రూపాయల సొంత నిధులతో 250 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు
  • గతంలోను 19 లక్షల రూపాయలతో 16 మంది దివ్యాంగులకు వాహనాల పంపిణీ..
  • మైత్రి మైదానంలో దివ్యాంగుల పండుగ..
  • సంబరంలా సాగిన ద్విచక్ర వాహనాల పంపిణీ..
  • కుటుంబ సభ్యులతో తరలివచ్చిన దివ్యాంగులు..
  • ఉద్వేగానికిలోనైనా దివ్యాంగులు..
  • కలలోనైనా ఊహించలేమంటూ ఆనంద భాష్పాలు..
  • మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామంటూ ప్రశంసలు..
  • ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసలతో అభినందించిన మంత్రి హరీష్ రావు
  • 10 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.

 

సంగారెడ్డి – పటాన్చెరు:  సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గురవుతున్న దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిక్సూచిగా మారారు. గడప దాటాలంటే మరొకరి సహాయం కావలసిన దుస్థితి నుండి సొంతంగా తమ సొంత వాహనంపై వెళ్లేలా అండగా నిలిచారు ఎమ్మెల్యే జిఎంఆర్. మంగళవారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో.. 250 మంది దివ్యాంగులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాజంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన సంచలమేనని అన్నారు. దివ్యాంగుల కోసం మూడు కోట్ల రూపాయలతో 250 ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రజలందరూ ఎమ్మెల్యే జీఎంఆర్ ను గుండెలనిండా ఆశీర్వదించాలని కోరారు. ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కితాబునిచ్చారు.

సీఎం కెసిఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వికలాంగులకు 3000 రూపాయల పెన్షన్ అందిస్తూ వారు జీవితాల్లో కొత్త వెలుగును నింపుతున్నారని అన్నారు.

సమున్నత లక్ష్యంతో అందించిన ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే జిఎంఆర్ విజ్ఞప్తి మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి తో చర్చించి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

250 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం పటాన్చెరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి లయన్స్ ఇండస్ట్రీస్ వరకు 10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించ తలపెట్టిన పైపులు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 250 మంది దివ్యాంగుల కొద్ది చక్ర వాహనాలు పంపిణీ చేయడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ కు వికలాంగుల సంస్థ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుల కార్పొరేషన్ తరపున ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించడంతోపాటు స్వయం ఉపాధి అందించేందుకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు.

శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వికలాంగుల కోసం ద్విచక్ర వాహనాల పంపిణీ చేయడం గొప్ప కార్యక్రమము అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :