మంచిరియల్ జిల్లా : బెల్లంపల్లి మండలంలోని లంబడి తండా, తల్లాగురిజలా, బట్వాన్ పల్లి ప్రజలు అడుగడుగునా మంగళ హారతి లో పూల మాలల వేసి ఘన స్వాగతం పలుకుతున్న గ్రామాలలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే కాలంలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యం మీ సమస్యలు తెలుసుకోవడనికే ఈ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ని పిపిరి నుండి పాదయాత్ర వస్తుంటే ఏ ఒక్క ఊరి లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇచ్చిన దాఖలాలు లేవు, ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ అయం లో రేషన్ కార్డ్ ఉన్న వారికి ఐదు రకాల నిత్యావసరుకులు ఇచ్చేది ఇప్పుడు రాష్ట్ర కనీసం బియ్యం కూడా ఇయ్యడం లేదు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బాండ ధర నిరుపేదల పాలిట శాపంగా మారింది. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఒకే దశలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తాం, గ్యాస్,పెట్రోల్,ధరలు తగిస్తామని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరం అయ్యలే చూస్తాం,ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల ఇస్తాం రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేరుకోగానే విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కళాశాలలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని కళాశాలలో సరైన వాష్ రూమ్లు కానీ క్లాస్ రూమ్ లో గ లేవని, క్లాస్ రూమ్ లో లేకపోవడంతో వరండాలో కూర్చోవడం జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. కళాశాల నుండి ఎస్సీ బీసీ హాస్టల్కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి అని తెలిపారు. నియోజకవర్గంలో పీజీ కళాశాల లేకపోవడంతో తల్లిదండ్రులు అమ్మాయిలను డిగ్రీతోనే చదువు ఆపించి వేస్తున్నారని కాబట్టి నియోజకవర్గం లో పీజీ కళాశాలను ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని వారు భట్టి విక్రమార్కను కోరారు. విద్యార్థులకు సమస్యలు విన్న బట్టి విక్రమార్క అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి యూనివర్సిటీలో త్రిబుల్ ఐటీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య వైద్య రంగాలను పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన తొమ్మిది నెలలో రాష్ట్రంలో ఒక్క యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లేక రాసి సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
