మంచిరియల్ జిల్లా : బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా ఆధ్వర్యంలో బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో నర్సింగ్ సూపరిడెంట్ గా సేవలందించిన అరుణ సుందరి పదవీవిరమణ సందర్బంగా శాలువా కప్పి బహుమతి అందించడం జరిగింది.అనంతరం ఉస్మాన్ పాషా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన సమయంలో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులకు అన్నీ తానై చూసుకున్నారని వారి సేవలకు సంస్థ విరమణ ఇచ్చిన జీవితాంతం ప్రజా సేవ చేసే గుణం కలిగిన వ్యక్తి అరుణ సుందరి అని అయన అన్నారు . ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవా సమితి సభ్యులు ఫరీద్, హాజి బాబా, ప్రశాంత్,ఉమేర్ నవాజ్, వాజీద్, తిరుపతి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
