కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామం ఉడుగులకుంట లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో స్వాతి క్షేత్ర సహాయకులు హన్మాండ్ల యాదగిరి తో కలిసి పరిశీలించారు. అనంతరం కూలీల మస్టర్ రోల్ కాల్ చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల నుండి పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలలోపే పనులు ముగించాలని కూలీలకు సూచించారు. వడదెబ్బ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని క్షేత్ర సహాయకులు హన్మాండ్ల యాదగిరి కి సూచించారు. ఈ కార్యక్రమంలో మేట్లు,కూలీలు పాల్గొన్నారు.
