నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం పునస్కరించుకొని బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ బిజెపి జెండాను ఆవిష్కరించడమైనది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు పెద్దోళ్ల గంగారెడ్డి మాట్లాడుతూ….
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ మరియు హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ . భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికన్న ముందు భారతీయ జనసంఘ్ ఏర్పడి ఈ దేశంలో రాజ్యాధికారం చేయడమైందని. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరున పార్టీ ఆవిర్భావించిందని. ఇప్పటికే 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఓ ప్రత్యేక రాజకీయ పార్టీగా ఎదిగి, ఓ విలక్షణమైన పార్టీగా అధిక సంఖ్యాకులు అయినటువంటి హిందూ వర్గ, మత సాంఘిక సాంప్రదాయ నియమాలతో దృడమైన జాతీయ శక్తిగా ఆవిర్భవించి. దేశంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి కాశ్మీర్లో 370 అధికరణాన్ని తొలగించడం, రామ మందిర నిర్మాణాన్ని చేపట్టడం, త్రిబుల్ తలాక్ తొలగించడం ఇలాంటి ఎన్నో పరిష్కారం కాని సమస్యలను సైతం పరిష్కరించి 70 సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కారంకాని ఎన్నో సమస్యలను ఈ యొక్క తొమ్మిది సంవత్సరాల్లో పూర్తి చేయడం ఒక భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరియు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోనే సాధ్యమైందని. కావున రాబోయే కాలంలో తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసే విధంగా కార్యకర్తలు రాముని సైన్యంలోని ఓ హనుమంతునిగా పని చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానంతరం బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ బిజెపి ప్రతిజ్ఞ చేయించడమైనది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రీ భాస్కర్ బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.