నిజామాబాద్ జిల్లా : గత రెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా , నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా , నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ గా వివిధ బాధ్యతల్లో క్రియాశీలంగా పనిచేసిన బుస్సాపూర్ శంకర్ గారు YSR తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు పార్టీ పదవులకు సోమవారం రోజు రాజీనామా చేశారు.
అనంతరం జరిగిన పరిణామాలతో ఘర్ వాపిసిలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి బీజేపీలో చేరడం జరిగిందన్నారు