- 13రోజుకు చేరుకున్న ఇళ్లస్థలల పోరాటం
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బావరావుపేట శివారు సర్వే నెంబర్ 8 లో గల అసైన్డ్ భూములను పేదలకు ఇవ్వాలని పేదలు చేస్తున్న ఇండ్ల స్థలాల పోరాటానికి 13 రోజున మద్దతు గా దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు హాజరై మాట్లాడుతూ… ఇళ్ల స్థలాల కొరకు నిరుపేద మహిళలు సుమారు వందల మంది భూ పోరాటం చేస్తుంటే స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు మరియు పోలీసులు పోరాటం చేస్తున్న మహిళలు ఉంటున్న వీధుల్లోకి, ఇంటి వరకు వెళ్లి మహిళలను బెదిరింపులకు గురి చేస్తున్నారు.ఇది సరైన పద్ధతి కాదు.ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పింది. కానీ నేటి వరకు ప్రభుత్వం ఆ హామీలు అమలు చేయలేదు. చివరికి పేదలే ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదల పై, సిపిఎం నాయకుల పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడం చాలా దారుణం. అక్రమార్కుల చేతుల్లో ఉన్న భూమిని విడిపించి వెంటనే పేదలకు పంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి, భూమిని రీ- అసైన్మెంట్ చేసి పేద ప్రజలకు పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోడంకి చందు, కావిరి రవి, అవేజ్ పట్టణ కార్యదర్శి, ఇళ్లస్థలాల పోరాట కమిటీ నాయకులు మణి, శ్రీనివాస్, ప్రసన్న, రేణుక, సాజిత్, సంధ్య, లలిత, సమ్మక్క,లత, వైశాలి, భానుమతి, రాధిక,లక్ష్మి, నవీన్ ఉమారాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు