రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల నుండి ఆసుపత్రి మంజూరు చేయకుండా మండల ప్రజలను మోసం చేస్తూ ప్రజల చెవులలో పువ్వులు పెట్టుతున్నారని, చెవులలో పువ్వులు పెట్టుకొని బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ ఇల్లంతకుంట మండలం కేంద్రంలో కేటీఆర్ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని 16-5- 2018 లో హామీ ఇచ్చి, 5సంవత్సరాల నుండి నిరసనలు ధర్నాలు చేస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మానికి 1.56 లక్షలు మంజూరు చేసి ఇదే 30 పడకల ఆసుపత్రి అని అబద్దాలు చెప్తే భగవంతుడు కూడా మిమ్మల్ని నమ్మక వేసిన శీలపాలకం కూడా నెలమట్టామైందిన్నారు, ఇలా మండల ప్రజల చెవులలో పువ్వులు పెట్టి మోసం చేస్తున్నారని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మండల యువజన సంఘాల నాయకులు చెవులలో పువ్వులు పెట్టుకొని నిరసన చేస్తుంటే కూడా పోలీస్ అధికారులను పంపి బలవంతంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. వెంటనే కేటీఆర్ ఇచ్చిన హామీ 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు బొల్లారం. ప్రసన్న, మామిడి. హరీష్, గజ్జల. శ్రీనివాస్, బోయిని.రంజిత్, దండవేణి. రజినీకాంత్, చొప్పరి. వంశీ, కర్ల.లక్ష్మన్, జనగం.రాజు, శ్రీరాముల. రమేష్, కర్ల. నర్సయ్య, చిట్టాల. శ్రీనివాస్, ఓరుగంటి. తిరుపతి, కోమటిరెడ్డి.అనిల్, అంతగిరి. అనిల్, దండ్ల.సురేష్, ప్రశాంత్, అజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
