సిద్దిపేట జిల్లా : బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ ద్యావ రాజశ్రీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్ ,చౌదరి మల్లేశం, ఫ్యాక్స్ డైరెక్ట్ గుడెల్లి లక్ష్మణ్, సీఈవో వాసు, వార్డ్ మెంబర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
