కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం, గన్నేరువరం, ఇల్లంతకుంట, మానకొండూర్ మండలాల్లో జరిగిన విహావా వేడుకల్లో నూతన వధూవరులను బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు మరియు రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ఆశీర్వదించారు.
కంది కట్కూరు ఎల్లమ్మ తల్లి మరియు మైలారం రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో గడ్డం నాగరాజు సొల్లు అజయ్ వర్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. టెంపుల్ అభివృద్ధి కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికినారు. ఈకార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
