కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన బండి సారవ్వ అనే మహిళ శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సారవ్వ కూతురు బండి లత అదే గ్రామానికి చెందిన చాడ బాపురెడ్డి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బాపురెడ్డి ఇటీవల మరో యువతని పెళ్లి చేసుకున్నాడు. మళ్లీ ఇటీవల సారవ్వ కూతురు లతను మూడు రోజులపాటు తీసుకెళ్ళి మళ్ళీ గ్రామంలో వదిలేశాడు.దీంతో కుటుంబ పరువు పోయిందని భావించిన సారవ్వ శనివారం వేకువజామున పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించింది.సారవ్వ మృతికి చాడ బాపురెడ్డే కారణమంటూ యువతి, మృతురాలు కుటుంబ సభ్యులు, బందువులు సారవ్వ మృతదేహంతో బాపురెడ్డి ఇంటిముందు ధర్నాకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గన్నేరువరం ఎస్ఐ మామిడాల సురేందర్, సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలికి కారణమైన బాపురెడ్డి పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో మోహరించిన పోలీసు బలగాలు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
