కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గన్నేరువరం ఎస్సై సిహెచ్ నరసింహారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ప్రమాదం జరుగుతే ఇచ్చిన, నడిపిన వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవన్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉండాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .
